'ది ప్యారడైజ్‌'లో కేసీఆర్‌ను పోలిన పాత్రపై చర్చ.. నాని సినిమా చూసిన మనవడు హిమాన్షు!

'ది ప్యారడైజ్‌'లో కేసీఆర్‌ను పోలిన పాత్రపై చర్చ.. నాని సినిమా చూసిన మనవడు హిమాన్షు!

The Paradise Movie Discussion On KCR Like Character Himanshu Rao Watches Nani Film
  • నాని 'ది ప్యారడైజ్' విడుదల.. ఓ పాత్రపై తీవ్ర చర్చ
  • కేసీఆర్‌ను పోలిన పాత్ర పోషించిన నటుడు ప్రియదర్శి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లు
  • కేసీఆర్ పాత్రపై చర్చ వేళ సినిమా చూసిన మనవడు హిమాన్షు
  • సినిమాలో గద్దర్‌కు నివాళి.. ఎన్టీఆర్ పాత్రపైనా ప్రచారం
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం గురువారం థియేటర్లలో విడుదలైంది. అయితే, సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఓ కీలక పాత్రపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సినిమాలో నటుడు ప్రియదర్శి పోషించిన 'ఎమ్మెల్యే శంకర్ అన్న' పాత్ర, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలో ప్రియదర్శి గెటప్, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్ అచ్చం కేసీఆర్‌ను గుర్తుకు తెస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ పాత్రను కేసీఆర్‌ను ఉద్దేశించే రూపొందించారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పాత్రకు సినిమాలో కీలక ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చర్చ జరుగుతున్న తరుణంలోనే కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు ఈ సినిమాను థియేటర్‌లో వీక్షించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అభిమానుల మధ్య కూర్చుని హిమాన్షు సినిమా చూస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేసీఆర్‌ను పోలిన పాత్రపై వివాదం నడుస్తుండగానే ఆయన మనవడు సినిమా చూడటం విశేషం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు సంబంధించిన పాత్ర కూడా ఉందని, అలాగే ప్రజాగాయకుడు గద్దర్‌కు నివాళి అర్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంమీద ప్రియదర్శి పోషించిన పాత్ర చుట్టూ జరుగుతున్న ప్రచారంతో 'ది ప్యారడైజ్' చిత్రం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ పాత్రపై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.
Advertisement
The Paradise
Nani
Priyadarshi
KCR
Himanshu Rao
MLA Shankar Anna

More Telugu News