"మీరు చనిపోయినా సరే బస్సు ఆపను".. 9 మంది సజీవదహన ఘటన ఎఫ్‌ఐఆర్‌లో షాకింగ్ విషయాలు
- బస్సులో ముందే కాలిన వాసన గుర్తించిన ప్రయాణికులు
- హెచ్చరికలను డ్రైవర్ పట్టించుకోలేదని ఎఫ్‌ఐఆర్
- బస్సులో డ్రైవర్, కండక్టర్ సిగరెట్లు తాగినట్లు ఆరోపణలు
- మీరు చనిపోయినా సరే బస్సు ఆపబోమన్నట్లు ఆరోపణలు
- ఏసీ వ్యవస్థ నుంచి మంటలు మొదలైనట్లు అనుమానం
గ్రేటర్ నోయిడాలో బస్సు అగ్నిప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో మంటలు చెలరేగడానికి కొన్ని నిమిషాల ముందే ప్రయాణికులు కాలుతున్న వాసన వస్తోందని డ్రైవర్, కండక్టర్‌కు చెప్పినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే వారు ప్రయాణికుల హెచ్చరికలను పట్టించుకోకుండా బస్సులో సిగరెట్లు తాగుతూ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ప్రమాదంలో మహిళ సహా తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బీహార్ రిజిస్ట్రేషన్ ఉన్న ఈ స్లీపర్ టూరిస్ట్ బస్సు ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబాకు వెళుతోంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ఉన్నారు.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. బస్సులో డ్రైవర్, కండక్టర్ సిగరెట్లు తాగడంపై ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వారు ప్రయాణికుల మాటలను పట్టించుకోకుండా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత బస్సులో బలమైన కాలిన వాసన వచ్చింది. ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. అయితే బస్సులో ఇలాంటి వాసన రావడం సాధారణమేనని డ్రైవర్ చెప్పినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.
వాసనకు కారణమేంటో చూడాలని ప్రయాణికులు పలుమార్లు కోరినా డ్రైవర్ బస్సును తనిఖీ చేయలేదని పోలీసులు తెలిపారు. ఇంతలో ముందు భాగం నుంచి మంటలు రావడం మొదలైంది. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ బస్సును ఆపాలని కోరినా డ్రైవర్ పట్టించుకోలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. “మీరు చనిపోయినా సరే.. బస్సు ఆపను” అని డ్రైవర్ చెప్పినట్లు అందులో ఉంది.
మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ బస్సును కమ్మేసింది. ప్రయాణికులు బయటకు రావడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బస్సు ఏసీ వ్యవస్థలో స్పార్క్ లేదా పేలుడు సంభవించి, ఇంజిన్‌లోని లూబ్రికేటింగ్ ఆయిల్‌కు మంటలు అంటుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.