వ్యభిచారం చేయడం ఇష్టంలేని యువతి ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసుల దాడులు!
- మోసం చేసి యువతులను రప్పించిన వ్యక్తి
- రాజేంద్రనగర్ పరిధిలో బలవంతపు వ్యభిచారం
- సమయం చూసి పోలీసులకు ఉప్పందించిన యువతి
వారిని తొలుత సముద్ర మార్గంలో కొల్‌కతాకు ఆపై అక్కడి నుంచి హైదరాబాద్ కు చేర్చారు. వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. వారిలోని ఓ యువతికి ఈ పని ఇష్టంలేదు. దీంతో సమయం చూసి, ఆమె పోలీసులకు ఉప్పందించింది. దీంతో నిన్న పోలీసులు ఆ ఇంటిపై దాడిచేశారు. సర్ఫరాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, ఇద్దరు యువతుల్లో ఒకరిని గుర్తించి, బాలికల సదనానికి పంపామని అన్నారు. రెండో యువతిని గుర్తించే పనిలో ఉన్నామని, వారికి పాస్ పోర్టులు ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.