చిరంజీవి పార్టీని అమ్ముకున్నారు.. ఇప్పుడు అదే పని చేసేందుకు పవన్ కల్యాణ్ వచ్చాడు: చంద్రబాబు
- నా సిద్ధాంతాలు కరెక్ట్ అని చెప్పిన పవన్... ఇప్పుడు మోసగాడు అంటున్నారు
- పవన్ ఊసరవెల్లి లాంటివాడు
- కోడికత్తి జగన్ డ్రామానే
పవన్ ఒక ఊసరవెల్లి లాంటివాడని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికి వైసీపీ, జనసేనలు వచ్చాయని అన్నారు. కోడికత్తి కూడా జగన్ డ్రామానే అని దుయ్యబట్టారు. నిజాయతీగా పని చేస్తున్న తమపై సీబీఐ దాడులు జరుపుతున్నారని... ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అనంతపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు. జిల్లాలోని 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను గెలిపించాలని కోరారు.