మోహన్ లాల్ 'ఒడియన్'కి స్టార్ హీరోల వాయిస్ ఓవర్
- భారీ మలయాళ చిత్రంగా 'ఒడియన్'
- విలక్షణమైన పాత్రలో మోహన్ లాల్
- మూడు భాషల్లో డిసెంబర్లో విడుదల
మలయాళ వెర్షన్ కి మమ్ముట్టి వాయిస్ ఓవర్ చెబుతారట. ఇక తమిళంలో రజనీకాంత్ తోను .. తెలుగులో ఎన్టీఆర్ తోను వాయిస్ ఓవర్ చెప్పించనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు భాషల్లోని ట్రైలర్స్ ను ఈ ముగ్గురు హీరోలతోనే రిలీజ్ చేయిస్తారట. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. మోహన్ లాల్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.