వికారాబాద్ జిల్లా బొంరాస్ పేటలో రేవంత్ రెడ్డి... దాడులను తేలికగా తీసుకున్న కాంగ్రెస్ నేత!
- దాడులను తేలికగా తీసుకున్న రేవంత్ రెడ్డి
- మదన్ పల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం
- రేవంత్ కు స్వాగతం పలికిన అభిమానులు
తమ గ్రామానికి వచ్చిన రేవంత్ కు ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి. ఈడీ సోదాలపై ఏ మాత్రం ఆందోళన లేకుండా రేవంత్ కనిపించినట్టు తెలుస్తోంది. ఆయన ప్రచారం, మదన్ పల్లి నుంచి, బురాన్ పూర్, బొంరాస్ పేట మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కొస్గి మండలం పోలేపల్లి వరకూ సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.