విద్యార్థులను బెదిరించే హక్కు మీకెవరిచ్చారు?.. యూనివర్సిటీలపై రాహుల్ ఫైర్
- జంతర్‌మంతర్‌కు వెళ్లొద్దన్న ఢిల్లీ యూనివర్సిటీ
- జేఎన్‌యూ కూడా ఇదే సూచన
- సోషల్ మీడియాలోనూ జాగ్రత్తలు
- విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొనొద్దని ఐఐటీ రూర్కీ ఆదేశం
- డీయూ అడ్వైజరీపై రాహుల్ ఆగ్రహం
- విద్యార్థులను బెదిరించొద్దన్న రాహుల్
జంతర్‌మంతర్‌లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థులకు జారీ చేసిన సూచనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించే హక్కు యూనివర్సిటీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘సమయం వచ్చినప్పుడు మీరే జవాబు చెప్పాల్సి ఉంటుంది’’ అన్నారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జంతర్‌మంతర్‌లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని డీయూ గురువారం సోషల్ మీడియాలో అడ్వైజరీ విడుదల చేసింది. జంతర్‌మంతర్‌లో జరిగే చట్టవిరుద్ధ సమావేశాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. విద్యార్థుల భద్రతతో పాటు వారి విద్యా, ఉద్యోగ అవకాశాలపై కూడా ప్రభావం పడొచ్చని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా నమ్మొద్దని సూచించింది.
ఇదే తరహా సూచనను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) కూడా విడుదల చేసింది. జంతర్‌మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలకు వెళ్లొద్దని, సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు యూనివర్సిటీ క్రమశిక్షణా చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
యూనివర్సిటీల చర్యలను పలువురు తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల గొంతు నొక్కడం కంటే వారి అభిప్రాయాలను గౌరవించాలని నటి పూజా భట్ పేర్కొన్నారు. డీయూ మాజీ విద్యార్థి, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా కూడా అడ్వైజరీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఐఐటీ రూర్కీ కూడా రాజకీయ ఆందోళనల్లో పాల్గొనవద్దని విద్యార్థులకు సూచించగా, ఇది ప్రతి ఏడాది జారీ చేసే సాధారణ మార్గదర్శకమేనని స్పష్టీకరించింది.