Advertisement

యూ/ఏ సర్టిఫికెట్‌తో విడుదలకు సిద్ధమైన ‘శ్రీనివాస మంగాపురం’

Jaya Krishna Ghattamaneni debut movie Srinivasa Mangapuram gets UA certificate
  • జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల
  • హీరోగా జయకృష్ణ ఘట్టమనేని అరంగేట్రం
  • హీరోయిన్‌గా రాషా థడానీ తెలుగు ఎంట్రీ
  • తెరకెక్కిస్తున్న దర్శకుడు అజయ్ భూపతి
  • విలన్ పాత్రలో మోహన్‌బాబు
  • జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కథానాయికగా నటిస్తూ తెలుగు చిత్రసీమకు పరిచయమవుతోంది. తిరుపతి నేపథ్యంగా సాగే ఈ ప్రేమకథలో వాసుబాబు, మంగా అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారిన తర్వాత వారి జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాల చుట్టూ కథ సాగుతుంది.

‘ఆర్‌ఎక్స్‌ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో గుర్తింపు పొందిన అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సినిమాపై అంచనాలను పెంచింది. అలాగే సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు వారసత్వాన్ని కొనసాగిస్తూ జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరకు పరిచయం కానుండడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ చిత్రంలో మోహన్‌బాబు ప్రతినాయకుడి పాత్రలో నటించారు. అశ్వినీదత్ సమర్పణలో చంద్రమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Advertisement
Jaya Krishna Ghattamaneni
Srinivasa Mangapuram
Ajay Bhupathi
Rasha Thadani
Mahesh Babu nephew debut
Mohan Babu

More Telugu News