Advertisement

పేపర్‌ లీక్‌పై కేంద్రం కఠిన చర్యలు.. భారీ జరిమానా, జైలు శిక్ష పెంపునకు సిద్ధం?

Central Government action on paper leak ready to increase heavy fine and jail sentence
  • పేపర్‌ లీక్‌ చట్టానికి కేంద్రం సవరణలు
  • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు ప్రతిపాదన
  • శిక్షలు, జరిమానాలు పెంచే యోచన
  • నేడు కేబినెట్‌ ఆమోదం పొందే అవకాశం
  • సోమవారం లోక్‌సభకు సవరణ బిల్లు వచ్చే ఛాన్స్‌
నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైంది. పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టం-2024ను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణలకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రతిపాదిత సవరణల్లో పేపర్‌ లీక్‌ కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను చేర్చనున్నట్లు తెలుస్తోంది. అలాగే నిందితులకు ప్రస్తుతం ఉన్న జైలు శిక్షలు, జరిమానాలను మరింత పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పేపర్‌ లీక్‌ కేసుల్లో దోషులుగా తేలితే మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృత నేరాల్లో ఐదు నుంచి పది సంవత్సరాల జైలు, కనీసం రూ.కోటి జరిమానా నిబంధన అమల్లో ఉంది.

కేబినెట్‌ ఆమోదం అనంతరం సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ కూడా పేపర్‌ లీక్‌లపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు, విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గత పదేళ్లలో దేశంలో 150 పేపర్‌ లీక్‌లు జరిగాయని, ఒక్క కేసులో కూడా శిక్షలు పడలేదని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Central Government
NEET paper leak
Public Examinations Act
Fast track courts
Narendra Modi
Paper leak punishment

More Telugu News