Advertisement

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడి మృతి.. విషాదంలో కుటుంబం

Telangana youth dies in US road accident family in grief
  • రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నిత్యానంద రెడ్డి
  • చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందినట్లు నిర్ధారణ
  • ఎంఎస్ పూర్తి చేసి డెట్రాయిట్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు
అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానంద రెడ్డి (26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త తెలియడంతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. గత శనివారం తన బైక్‌పై బయటకు వెళ్లగా, వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నిత్యానంద రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న స‌మ‌యంలోనే అతని పరిస్థితి విషమించింది. నిన్న‌ బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఒక్కగానొక్క కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Advertisement
Nithyananda Reddy
Telangana youth death USA
Nirmal youth road accident Detroit
Indian student death Michigan
Narsapur Laxmanchanda Nirmal news
US road accident victim Telangana

More Telugu News