అలా చేస్తే కేసీఆర్ కూ అదే గతి పడుతుంది: ఆర్.కృష్ణయ్య

  • ‘ముందస్తు’కు వెళ్లిన వాళ్లకు ఏగతి పట్టిందో చూశాం
  • ఊరికో ఉద్యోగం కూడా కేసీఆర్ ఇవ్వలేదు
  • బీసీలను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోంది
తెలంగాణలో ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని, ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వాళ్లకు ఏ గతి పట్టిందో కేసీఆర్ కూ అదే గతి పడుతుందని అన్నారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని, బీసీలను అణచివేసే కుట్రతోనే క్రిమిలేయర్ తెచ్చారని విమర్శించారు.
Go Back to Shorts
r.krishnaiah
kcr

More Telugu News