రికార్డ్ టైమ్ లో అసెంబ్లీ, సెక్రటేరియట్ ను కట్టిన చంద్రబాబు.. హైకోర్టు కోసం బిల్డింగ్ మాత్రం కట్టడం లేదు: లోక్ సభలో టీఆర్ఎస్ విమర్శ
- కావాలనే హైకోర్టు భవనాన్ని చంద్రబాబు నిర్మించడం లేదు
- హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలి
- ట్రైబల్ యూనివర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలను నిర్మించాలి
ఏపీకి సెంట్రల్ యూనివర్శిటీని మంజూరు చేశారని... తెలంగాణకు ట్రైబల్ వర్శిటీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని... కానీ, ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదని వినోద్ చెప్పారు. యూనివర్శిటీ ఏర్పాటు కోసం కావాల్సినంత స్థలం ఉన్నప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారానికి కూడా హామీ ఇచ్చారని... కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు.