bjp: ప్రభుత్వం మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోంది: బీజేపీపై విరుచుకుపడ్డ సురవరం

షార్ట్స్‌లో చూడండి
భారతీయ జనతా పార్టీపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని, గో సంరక్షణ పేరిట దళితులు, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గ సీపీఐ జనరల్ బాడీ సమావేశంలో సురవరం సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఆగడాలు ఎక్కువైపోయాయని ఆరోపించారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సీపీఐని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని, వామపక్షపార్టీలు ఐక్యంగా ఉద్యమాలు, వర్గ పోరాటాలు చెయ్యాలని ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
Go Back to Shorts
bjp
suravaram

More Telugu News