హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా తొట్టత్తిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
- ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి
- నియమకపు ఉత్తర్వులు విడుదల
- త్వరలోనే జస్టిస్ రంగనాథన్ కు పదోన్నతి
కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్ 29న జన్మించిన రాధాకృష్ణన్, కర్ణాటకలోని కేజీఎఫ్ లా కాలేజీలో విద్యను అభ్యసించారు. 2004 అక్టోబర్ లో కేరళ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక జూలై 2016 నుంచి, హైదరాబాద్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రమేష్ రంగనాథన్, త్వరలో మరో రాష్ట్ర హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వెళతారని సమాచారం.