హీరో మోహన్ లాల్ ఇంటి ముందు ధర్నా.. ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు యత్నం
- మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోహన్ లాల్
- లైంగిక వేధింపుల కేసులో ఉన్న దిలీప్ పై సస్పెన్షన్ ఎత్తివేత
- ధర్నా చేపట్టిన యూత్ కాంగ్రెస్
దీంతో, కేరళలో కలకలం రేగింది. మహిళలకు హాని చేస్తున్నవారికి మద్దతు ఇవ్వరాదంటూ యూత్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. అయితే, ఈ సమయంలో మోహన్ లాల్ ఇంట్లో లేరు. మరోవైపు, తమ అభిమాన నటుడికి హాని తలపెడితే చూస్తూ ఊరుకోబోమంటూ ఆయన అభిమానులు పోటీ ధర్నాలు చేపట్టారు.
ఇదే సమయంలో, విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యుసీసీ) కూడా దిలీప్ సభ్యత్వంపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైంది. ఈ నేపథ్యంలో దిలీప్ మాట్లాడుతూ, కేసులో తాను నిర్దోషినని తేలేంత వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు దూరంగా ఉంటానని ప్రకటించాడు.