Jagan: ఇక్కడి ఇసుక మాఫియాను ‘లోకేష్ ర్యాంపు’ అని పిలుస్తారు!: జగన్ ఆరోపణలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ అధినేత జగన్ మరోమారు అవినీతి ఆరోపణలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఈ మండలంలోని లంకల గన్నవరంలో రోజూ వేల లారీల ఇసుక దోచేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ కొనసాగుతున్న ఇసుక మాఫియాను ‘లోకేష్ ర్యాంపు’ అని స్థానికులు పిలుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

దీంతో, ఇక్కడికి అధికారులు, పోలీసులు ఎవరూ వెళ్లడం లేదని ఆరోపించారు. మట్టిని, ఇసుకను దోచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విధానాలతో విసిగిపోయిన కోనసీమ రైతులు, కూలీలు వలసపోతున్నారని, కొబ్బరిపై ఐదు శాతం జీఎస్టీని చంద్రబాబు వేయించారని అన్నారు.
Go Back to Shorts
Jagan
Nara Lokesh

More Telugu News