ఆత్రేయపురం పూతరేకులు రుచి చూసిన జగన్!

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మూడో రోజు కొనసాగింది. ఇందులో భాగంగా ఆత్రేయపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఖ్యాతి గాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీదారులను జగన్ కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ స్థానికురాలు తయారు చేసిన పూతరేకులను జగన్ టేస్ట్ చేసి.. బాగున్నాయని ప్రశంసించారు. 

కాగా, ఈరోజు పాదయాత్ర పేరవరం నుంచి ప్రారంభించి.. వెలిచేరు, వద్దిపర్రు క్రాస్‌ మీదుగా పులిదిండి, ఉచ్చిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగింది. 
Go Back to Shorts
Jagan
aatreyapuram

More Telugu News