అలా రాసిపెట్టి ఉంది... జరిగిందంతే: క్రిస్ గేల్
- ఈ ఐపీఎల్ సీజన్ లో రాణిస్తున్న క్రిస్ గేల్
- నాలుగు మ్యాచ్ లలో 252 పరుగులు
- వద్దని పక్కన బెట్టేసిన ఆర్సీబీ
- కనీస ధరకే కొన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్
తనను వేలంలో ఎవరూ కొనుగోలు చేయడం లేదని తెలిసిన తరువాత తానేమీ బాధపడలేదని, జీవితమంటే క్రికెట్ మాత్రమే కాదన్నది తన అభిప్రాయమని చెప్పాడు. నమ్మకంతో తనను కొనుగోలు చేసిన జట్టుకు సేవలందించడమే ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యమని చెప్పాడు. తాను ఏ జట్టుకు ఆడుతున్నా, ఆ జట్టు గెలవాలనే కోరుకుంటానని చెప్పుకొచ్చాడు. మిగతా ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనకపోవడంపై స్పందిస్తూ, తానేమీ తప్పుగా ప్రవర్తించలేదని అన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ రాణించడం ఎవరి వల్లా కాదని, ఎత్తుపల్లాలు సహజమేనని చెప్పాడు.