జుకర్ బర్గ్ వేతనం ఒక్క డాలరే... భద్రత కోసం మాత్రం 73 లక్షల డాలర్ల వ్యయం!
- మార్క్ జుకర్ బర్గ్ కోసం సంస్థ భారీ వ్యయం
- ఆయన భద్రత తమకు ముఖ్యమంటున్న కంపెనీ
- 2017లో 50 శాతం పెరిగిన వ్యయాలు
జుకర్ బర్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై 73 లక్షల డాలర్లు, ఆయన వ్యక్తిగతంగా వినియోగించే విమానం కోసం 2017లో 15 లక్షల డాలర్లు ఖర్చయ్యాయి. 2016లో ఇవే అవసరాల కోసం ఫేస్ బుక్ చేసిన వ్యయం 58 లక్షల డాలర్లే. కానీ ఏడాది తిరిగే సరికి ఆయనపై ఖర్చులు 50 శాతం పెరిగిపోయాయి. వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో అయిన జుకర్ బర్గ్ కు ఉన్న బెదిరింపుల దృష్ట్యా ఆయన భద్రత తమకు చాలా ముఖ్యమని కంపెనీ పేర్కొంది. కంపెనీ సీవోవో షెరిల్ శాండ్ బర్గ్ భద్రత కోసం కూడా 26 లక్షల డాలర్లు ఖర్చు చేసినట్టు తెలిపింది.