Rahul Gandhi: రాహుల్ గాంధీపై యడ్యూరప్ప తీవ్ర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ‘పిల్లోడు, కుర్రకుంక’ అంటూ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. బీజేపీ సోషల్ మీడియా కాంక్లేవ్ లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కర్ణాటకలో రాహుల్ ప్రచారం చేపట్టనుండటంపై విమర్శలు గుప్పించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము మరిన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని, 150కి పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు పేదరిక నిర్మూలనకు పాటుపడాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ పార్టీ మాత్రం నిజాయతీగా పేదలకు చేయూత నిస్తోందని అన్నారు. కాగా, ఏప్రిల్ - మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 
Go Back to Shorts
Rahul Gandhi
Karnataka
yedurappa

More Telugu News