ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం.. కానీ రాజీనామా ఎప్పుడనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్
- తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్య
- ఆయనది వ్యక్తిగత అభిప్రాయం అన్న ఎమ్మెల్సీ
- ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీపడబోము
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో తాము రాజీపడబోమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాము వీలైనంత వరకు తమ ఆవేశాన్ని అణచుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను సాధించడానికి కృషి చేస్తామని అన్నారు. తమకు ఏ పదవులూ ముఖ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం నుంచి చివరి ఆశ కూడా పోతే రాజీనామా చేస్తామని అన్నారు. ఆదినారాయణ ఆవేశానికి గురై రాజీనామా చేస్తామని మీడియాతో చెప్పినట్లున్నారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటామని, జగన్‌లా వ్యక్తిగత అవసరాన్ని బట్టి తీసుకోబోమని వ్యాఖ్యానించారు.