'జిల్ జిల్ జిగేల్...' అంటూ రూ. 50 లక్షలు పుచ్చుకుంటున్న పూజా హెగ్డే!
- రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
- స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించిన పూజా హెగ్డే
- ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
సుకుమార్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అందునా రామ్ చరణ్ పక్కన అనేసరికి ఎగిరి గంతేసి ఒప్పుకుందట. "జిల్ జిల్ జిగేల్..." అంటూ ఈ పాట సాగుతుందని, ఇప్పటికే క్రేజీ ఆఫర్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఆమె, మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమైందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.