pooja hegde: అదంతా పుకారేనంటోన్న పూజా హెగ్డే

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో 'దువ్వాడ జగన్నాథమ్' సినిమాతో కుర్రకారు మనసులను కట్టి పడేసిన పూజా హెగ్డే, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'సాక్ష్యం' సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయే రెండు మూడు భారీ ప్రాజెక్టులలో కథానాయికగా ఆమె పేరు వినిపిస్తోంది.

ఇదిలా ఉంచితే, పూజా హెగ్డే మళ్లీ హిందీ సినిమాలకి సైన్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అది నిజమేననుకుంటే తెలుగులో వచ్చే అవకాశాలు కూడా రాకుండాపోతాయని భావించిందో ఏమో వెంటనే స్పందించింది. తాను ఇంతవరకూ ఏ హిందీ సినిమాకి సైన్ చేయలేదనీ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని అంది. ఒకవేళ తాను హిందీ సినిమాను ఒప్పుకుంటే ఆ సంగతిని తానే వెల్లడిస్తానని స్పష్టం చేసింది. మొత్తానికి పూజా హెగ్డేకి ముందుగానే జాగ్రత్త పడటం తెలిసిపోయింది.     
Go Back to Shorts
pooja hegde

More Telugu News