కోర్టు ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన హీరోయిన్ అమలాపాల్
- గతంలో ఖరీదైన కారు కొన్న అమలాపాల్
- తప్పుడు చిరునామా పత్రాలు సమర్పించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టిన వైనం
- బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నటి
- లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో ఎట్టకేలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన హీరోయిన్
ఇటీవల ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, తిరస్కరించిన కోర్టు, క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె లొంగిపోయింది. తాను ఎటువంటి తప్పు చేయలేదని గతంలో చెప్పుకున్న ఆమె.. ఇప్పుడు తప్పును అంగీకరించినట్లు సమాచారం. ఆమె మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.