kcr: యాదవుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి విజయవాడలో పాలాభిషేకం!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి విజయవాడలో పాలాభిషేకం చేశారు. యాదవ కులస్తులకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో, యాదవ యువభేరి నాయకులు, కార్యకర్తలు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యాదవ నేతకు రాజ్యసభ సీటును ప్రకటించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు పాలాభిషేకాలు చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అమరావతి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి, కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదాన్ని కేసీఆర్ కు అందజేస్తామని చెప్పారు. 
Go Back to Shorts
kcr
TRS
yadava yuvabheri

More Telugu News