Nagarjuna: 12 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్న నాగార్జున సోదరి, శ్రీనివాస్

షార్ట్స్‌లో చూడండి
మోసం చేశారంటూ తన వ్యాపార భాగస్వామి చింతలపూడి శ్రీనివాస్ పై అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ 12 ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. శ్రీనాగ్ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో వీరిద్దరూ కలసి సినిమాలను కూడా నిర్మించారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా ఆటాడుకుందాం రా, కాళిదాసు, కరెంట్, అడ్డా తదితర చిత్రాలను తెరకెక్కించారు. ఇద్దరూ కలసి రియలెస్టేట్ వ్యాపారాలు కూడా చేశారు.

అయితే, గత ఏడాది కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల తెరకెక్కిన 'ఆటాడుకుందాం రా' సినిమా విషయంలో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. నాగార్జున చొరవతో ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు జరిగినా, అవి ఫలించలేదు. వీరి విభేదాలకు సంబంధించి ఓ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. కేసు కోర్టులో ఉండగానే ఆయనపై నాగ సుశీల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ చేశారంటూ శ్రీనివాస్ తో పాటు మరో 13 మందిపై ఆమె కేసు పెట్టారు.
Go Back to Shorts
Nagarjuna
naga suseela
chintalapudi sreenivas

More Telugu News