Nagarjuna: నాగ్ .. వర్మ తాజా చిత్రంలో గెస్టుగా అమితాబ్?

షార్ట్స్‌లో చూడండి
నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ ఒక యాక్షన్ థ్రిల్లర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలనేది ఆలోచన. ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 'శివ' సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించిన వర్మ, ఈ సినిమా అంతకిమించి ఉంటుందని చెబుతుండటం విశేషం.

ఇక ఈ సినిమాలో అమితాబ్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఓ గెస్టు రోల్ వుందట. నిడివి పరంగా చిన్నదే అయినా, కథలో ఈ పాత్ర కీలకంగా నిలుస్తుందని చెబుతున్నారు. దాంతో ఈ పాత్ర కోసం అమితాబ్ ను వర్మ సంప్రదిస్తున్నాడని అంటున్నారు. గతంలో అమితాబ్ - నాగ్ హిందీ 'ఖుదాగవా'లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా 'టబూ' నటిస్తుందంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని వర్మ తేల్చేశాడు కూడా. మరి అమితాబ్ గెస్టుగా చేస్తాడనే ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.                
Go Back to Shorts
Nagarjuna
amitabh

More Telugu News