పిల్లల్లో దాగివున్న టాలెంట్ బయటికి తీసుకురావడం గురించి పుస్తకం రాయనున్న నటి
- రెండో పుస్తకం రాయనున్న శిల్పాశెట్టి
- పూర్తిగా పిల్లల పెంపకం గురించిన విషయాలే
- టీవీ షోలో పిల్లలే స్ఫూర్తి
ఈ పుస్తకంలో పూర్తిగా పిల్లల పెంపకం గురించి ఆమె వివరించనున్నారు. అంతేకాకుండా టీవీ కార్యక్రమాల్లో కొంతమంది పిల్లలు చూపించిన అద్భుత ప్రతిభ గురించి కూడా ఆమె పుస్తకంలో ప్రస్తావించనున్నారట. పిల్లల్లో కనిపించే మొత్తం 465 ఆసక్తికర ప్రతిభల గురించి ఆమె తెలియజేయనున్నారు. `ద గ్రేట్ ఇండియన్ డైట్: బస్టింగ్ ద బిగ్ ఫ్యాట్ మిత్` పేరుతో ఆమె ఇప్పటికే ఓ పుస్తకం రాశారు. ఇందులో ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, జీవన విధానాల గురించి శిల్పా వివరించారు.