బాలకృష్ణతో మరోసారి పూరీ జగన్నాథ్ .. ఈ సారి పొలిటికల్ డ్రామా?
Add ap7am to your home Screen

బాలకృష్ణతో మరోసారి పూరీ జగన్నాథ్ .. ఈ సారి పొలిటికల్ డ్రామా?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన 'పైసా వసూల్' .. సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మాస్ హీరో .. మాస్ డైరెక్టర్ కల్సి చేసిన సినిమా కావడంతో, 'పైసా వసూల్' పై భారీ అంచనాలు వున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందే ఛాన్స్ ఉందనే వార్తలు తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే, బాలకృష్ణకి పూరీ జగన్నాథ్ ఓ కొత్త కథను చెప్పాడట. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగే ఈ కథ నచ్చడంతో, తప్పకుండా చేద్దామని బాలకృష్ణ మాట ఇచ్చినట్టు సమాచారం. బాలకృష్ణ తనకి నచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ సినిమాలు చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. అందువలన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ మళ్లీ సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదని చెప్పుకుంటున్నారు.  
balakrishna
puri

More Telugu News