కోట నీలిమపై వ్యాఖ్యల వివాదం.. ఒవైసీపై మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
Advertisement
- కోట నీలిమపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్
- పవన్ ఖేరా, అసదుద్దీన్ ఒవైసీ మాటల యుద్ధంతో మొదలైన వివాదం
- నీలిమ డిపాజిట్ కోల్పోయారన్న ఒవైసీ వ్యాఖ్యలను ఖండించిన హైదరాబాద్ కాంగ్రెస్
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమను ఉద్దేశించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు శనివారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఒవైసీపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. మహిళా నేతపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని, ఈ వ్యవహారంపై ఒవైసీకి నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కాంగ్రెస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కోట నీలిమ సనత్‌నగర్ నియోజకవర్గంలో మహిళలు, మైనారిటీలు, బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న బలమైన నేత అని తెలిపారు. రాజకీయ విభేదాల కోసం మహిళా ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వారి గౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. ఒవైసీ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, నీలిమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళల గౌరవాన్ని కాపాడేలా మహిళా కమిషన్ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వివాదం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ పవన్ ఖేరా హిందీ సినిమా ‘మైన్ తులసి తేరే ఆంగన్ కీ’ని ఉటంకించారు. యూపీలో ప్రస్తుతం ‘మైన్ ఒవైసీ తేరే ఆంగన్ కా’ అనే కొత్త సినిమా నడుస్తోందని ఎద్దేవా చేశారు.
ఖేరా వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. పవన్ ఖేరా ముందుగా తన భార్య (కోట నీలిమ) గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె డిపాజిట్ కోల్పోయారని ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తమ సొంత పార్టీలోని పరిణామాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఖలీద్ సైఫుల్లా ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టి ఒవైసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోట నీలిమ డిపాజిట్ కోల్పోయారంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సైఫుల్లా స్పష్టం చేశారు. మహిళా నాయకులపై ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.