దీపావళికి టపాసులు కాలిస్తే తప్పేంటి? కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు
Advertisement
- దీపావళి టపాసులపై యోగి ఆదిత్యనాథ్ హర్షం
- ఒక్కరోజు సంబరాలతో కాలుష్యంపై ఆందోళన ఎందుకని ప్రశ్న
- అయోధ్యలో తానూ బాణసంచా కాల్చినట్లు వెల్లడి
- పండుగలపై ఆంక్షలను తమ ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టీకరణ
- అవినీతితో వ్యవస్థను కలుషితం చేసేవారిని ప్రశ్నించడం లేదని విమర్శ
దీపావళి వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా టపాసులు కాల్చడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఒక్క రోజు పండుగను ఆనందంగా జరుపుకొంటే కాలుష్యం పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటని ప్రశ్నించారు. కాలుష్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది కొంతకాలానికి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు.
ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడం సంతోషంగా ఉందని యోగి అన్నారు. అయోధ్యలో తాను కూడా దీపావళి వేడుకల్లో పాల్గొని బాణసంచా కాల్చినట్లు గుర్తుచేశారు. తమ ప్రభుత్వం పండుగలపై ఆంక్షలు విధించడాన్ని ప్రోత్సహించలేదని, ప్రజలు స్వేచ్ఛగా వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటోందని చెప్పారు.
వ్యవస్థ మొత్తాన్ని అవినీతి పనులతో కలుషితం చేసేవారిని ఎవరూ ప్రశ్నించరని, ప్రజలు ఒక్కరోజు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటే మాత్రం వెంటనే కాలుష్యం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఇతరులు పండుగలు జరుపుకొంటూ ఆనందంగా ఉన్నప్పుడే కొందరికి కాలుష్యం గుర్తుకొస్తోందని వ్యాఖ్యానించారు.
దీపావళికి ముందు దేశంలోని పలు నగరాల్లో గాలి నాణ్యత క్షీణించింది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నవంబర్ 9న ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 371గా నమోదైంది. 2021 తర్వాత ఇదే అత్యంత అధ్వాన స్థాయి. పలు పర్యవేక్షణ కేంద్రాల్లో ఏక్యూఐ 400 దాటడంతో గాలి నాణ్యత తీవ్ర కేటగిరీలోకి వెళ్లింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడి ‘పూర్’ స్థాయికి చేరింది.