- క్యాన్సర్ చికిత్సలో వాడే 1,364 రకాల ఔషధాల ధరలను భారీగా తగ్గించిన కేంద్రం
- సవరించిన నూతన ధరలు నేటి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి
- ధరల తగ్గింపుతో బాధితులకు ఏటా రూ. 3,540 కోట్ల మేర కలగనున్న ఊరట
- గరిష్ఠంగా 96.45 శాతం మేర తగ్గిన కీలక ఔషధాల ఎంఆర్పీ
- నిబంధనలు ఉల్లంఘిస్తే 1800-111-255 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేసే వెసులుబాటు
దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో అత్యంత కీలకమైన మందుల ధరలను భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం సోమవారం (2026 నవంబర్ 9) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) క్యాన్సర్ నిరోధక మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేయడంతో, మార్కెట్లో లభించే దాదాపు 1,364 రకాల ఔషధ ఫార్ములేషన్ల గరిష్ఠ చిల్లర ధరలు (ఎంఆర్పీ) గణనీయంగా తగ్గాయి.
నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్పీపీఏ ఈ చర్యలు చేపట్టింది. మొత్తం 85 ఫార్మా కంపెనీలకు చెందిన 121 రకాల క్యాన్సర్ ఔషధాలు ఈ తాజా ధరల తగ్గింపు పరిధిలోకి వచ్చాయి. వీటిలో 679 బ్రాండ్ల ధరలు ఏకంగా 50 శాతం కంటే ఎక్కువగా తగ్గగా, కొన్ని మందులపై అత్యధికంగా 96.45 శాతం వరకు తగ్గింపు నమోదైంది. ఈ కీలక నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు మందుల కొనుగోలుపై ఏటా సుమారు రూ. 3,540.38 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
దాదాపు 20 రకాలకు పైగా క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగించే కీలకమైన ఇమ్యునోథెరపీ మరియు ఇతర ప్రాణరక్షక ఔషధాల ధరలు దిగివచ్చాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే 'అనస్ట్రోజోల్' (10 మాత్రలు) పాత ధర రూ. 695.76 ఉండగా, అది ఇప్పుడు కేవలం రూ. 73కే అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన 'అజాసైటిన్' ఇంజెక్షన్ ధర రూ. 6,337 నుంచి రూ. 1,495.04కు తగ్గింది. అబోట్ సంస్థకు చెందిన 'బెవాసిజుమాబ్' (4 ఎంఎల్) ఇంజెక్షన్ పాత ధర రూ. 21,767.70 కాగా, తాజా మార్గదర్శకాలతో అది రూ. 5,930.13కు లభించనుంది.
అలాగే ఆర్పీజీ లైఫ్ సైన్సెస్‌కు చెందిన 'డెబ్రుమాబ్ 60 ఎంజీ' ఇంజెక్షన్ ధర రూ. 22,031.25 నుంచి రూ. 5,941కి, 'ఎనుటా' క్యాప్సూల్స్ (28 మాత్రలు) ధర రూ. 6,578.20 నుంచి రూ. 2,232కు పడిపోయాయి. వీటితో పాటు ఎర్లోటినిబ్, ఫ్లుడారాబిన్, ఫుల్వెస్ట్రాంట్ వంటి పలు కీలక ఔషధాల ధరలు కూడా భారీగా తగ్గాయి.
సవరించిన ధరలను రిటైలర్లు, డీలర్లు, ఆసుపత్రులు మరియు మెడికల్ దుకాణాలు తమ ప్రాంగణాల్లో బోర్డులపై, అలాగే తమ వెబ్సైట్లలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. నూతన ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని తేల్చిచెప్పారు. ఈ నిబంధనల అమలును రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు.
వినియోగదారులు సవరించిన ధరల వివరాలను ఔషధ ప్యాకెట్లపై చూసుకోవడంతో పాటు 'ఫార్మా సహీ దామ్' మొబైల్ యాప్ లేదా ఎన్పీపీఏ వెబ్సైట్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే, బాధితులు 'ఫార్మా జన్ సమాధాన్' పోర్టల్ ద్వారా గానీ, లేదా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 1800-111-255 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.