భర్త తప్పుతో వార్తల్లోకి లోరీ మిల్స్.. వారి ప్రేమకథ మీకు తెలుసా?
Advertisement
- ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధం కలకలం
- ఆయన భార్య లోరీ మిల్స్ హువాంగ్ గురించి ఆసక్తికర చర్చ
- జెన్సన్, లోరీలది 41 ఏళ్ల వివాహ బంధం
- గతంలో మైక్రోచిప్ డిజైనర్‌గా పనిచేసిన లోరీ
- చైనా ఏజెంట్‌గా అనుమానిస్తున్న మహిళతో జెన్సన్ ఎఫైర్
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధం వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ అనూహ్య పరిణామంతో ఆయన భార్య లోరీ మిల్స్ వాంగ్ వార్తల్లోకి వచ్చారు. దాదాపు 41 ఏళ్లుగా ఆయనతో కలిసి జీవిస్తున్న లోరీ ఎవరు? వారి బంధం ఎలాంటిది? అనే విషయాలపై ఇప్పుడు అందరూ ఆసక్తి చూపుతున్నారు.
జెన్సన్ హువాంగ్.. చైనా వ్యాపారవేత్త అలిస్ వాంగ్‌తో సంబంధం కొనసాగించినట్లు అంగీకరించారు. అలిస్‌ను అమెరికా నిఘా వర్గాలు చైనా గూఢచారిగా అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్విడియా బోర్డు ఒక స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఈ వివాదం కారణంగా జెన్సన్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆయన భార్య లోరీ గురించి చర్చ మొదలైంది.
లోరీ, జెన్సన్.. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివే రోజుల్లో కలుసుకున్నారు. అప్పుడు జెన్సన్ వయసు 17 ఏళ్లు. ల్యాబ్ పార్ట్‌నర్‌గా ఉండమని ఆయనే లోరీని కోరారు. అలా వారి ప్రేమ కథ మొదలైంది. అనంతరం 1985లో వివాహం చేసుకున్నారు. లోరీ గతంలో హ్యూలెట్-ప్యాకర్డ్ (హెచ్‌పీ)లో మైక్రోచిప్ డిజైనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, 'జెన్-సన్ అండ్ లోరీ హువాంగ్ ఫౌండేషన్' ద్వారా విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
తన భార్యను, పిల్లలను బాధపెట్టానని, క్షమించాలని జెన్సన్ ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, ప్రస్తుతానికి సీఈవోగా కొనసాగుతానని స్పష్టం చేశారు. జెన్సన్ నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని ఎన్విడియా బోర్డు తెలిపింది.