నటుడు ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా 'ఇడుపు కాయితం'. ఈ సినిమా నుంచి 'బరాత్ బీట్' పేరుతో ఓ కొత్త మాస్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. పెళ్లి సందడి నేపథ్యంలో సాగే ఈ పాటలో కథానాయిక నాగదుర్గ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన నాగదుర్గ నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'శ్రీలత', 'గడప' పాటలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు 'బరాత్ బీట్' పాటతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు.

సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ కథలో అభినవ్ గోమఠం, మైమ్ మధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Play video