తమిళంలో రూపొందిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్'. మరియప్పన్ చిన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, జీవీ ప్రకాశ్ కుమార్ - కయాదు లోహర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 4వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 30వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు ఇతర భాషలలోను అందుబాటులో ఉంది.
మహి ( జీవీ ప్రకాశ్ కుమార్) తన మేనమామకి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తూ ఉంటాడు. ఇంటి ఓనర్ ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తుండటంతో, మరో సింగిల్ రూమ్ కోసం వెతుకుంతుంటాడు. అదే సమయంలో తన ఫ్లాట్ లో షేరింగ్ కి అవకాశం ఉందంటూ 'సింధు' ( కయాదు లోహర్) నుంచి కాల్ వస్తుంది. దాంతో అతను ఆమె ఫ్లాట్ లో దిగుతాడు. ఖరీదైన ఫ్లాట్ లో .. అందునా అందమైన అమ్మాయితో కలిసి రూమ్ షేర్ చేసుకోవలసి రావడం తన అదృష్టంగా భావిస్తాడు.
సింధు ఏ పనీ చేయకపోవడం .. వంట కూడా చేయకపోవడం మహి ఆశ్చర్యపోయేలా చేస్తుంది. తనకి ఏది తినాలని అనిపిస్తే ఆమె ఆల్రెడీ వాటిని తెప్పించి ఉంచడం విస్మయాన్ని కలిగిస్తుంది. సింధుతో అతనికి సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆమె కూడా తన పట్ల ఆకర్షితురాలైందనే విషయం అతనికి అర్థమవుతుంది. అదే సమయంలో ఆ ఇంట్లో ఒక వయసు మళ్లిన వ్యక్తి ఉండటాన్ని 'మహి' చూస్తాడు. అతను తన తాతయ్య అనీ .. ఆయనకి ఆరోగ్యం బాగోలేదని సింధు చెబుతుంది. ఆ మాటలను గురించి 'మహి' పెద్దగా పట్టించుకోడు.
అయితే సింధు లేని సమయం చూసి ఆ వృద్ధుడు మహికి ఒక నిజం చెబుతాడు. తాను సింధుకి తాతయ్యను కాననీ, సింధుపై మనసు పడిన ఒక డాక్టర్ నని చెబుతాడు. సింధు ఒక సాధారణ స్త్రీ కాదనీ .. ఆమె ఒక 'రక్త పిశాచి' అని అంటాడు. తనకి నచ్చిన 'బ్లడ్ గ్రూప్' కలిగినవారిని ట్రాప్ చేసి, రక్తదాహం తీర్చుకోవడమే ఆమె పని అని చెబుతాడు. సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి పారిపొమ్మని హెచ్చరిస్తాడు. అప్పుడు 'మహి' ఏం చేస్తాడు? బయటపడటం కోసం అతను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది కథ.
అందమైన అమ్మాయితో విలాసవంతమైన జీవితాన్ని కోరుకున్న ఒక సాధారణ యువకుడికి అనుకోకుండా అవి దొరుకుతాయి. తన అదృష్టానికి తానే మురిసిపోతూ ఉండగా, ఆ యువతీ ఒక రక్తపైశాచి అని అతనికి తెలుస్తుంది. ఆమె అనుమతి లేకుండా అక్కడి నుంచి బయటపడలేమనే విషయం అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ రక్తపైశాచీ నేపథ్యం ఏమిటి? అనే ప్రధానమైన అంశాలను కలుపుకుంటూ దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు.
ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసే ఒక బ్యాచిలర్ కుర్రాడు, ఒక అందమైన అమ్మాయి ఇంట్లో స్థానం సంపాదిస్తాడు. ఆ అమ్మాయి విషయంలో కొన్ని అనుమానాలు .. మరికొన్ని సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఆమె అందం .. ఆమె పట్ల గల ఆకర్షణ .. వ్యామోహం అతనిని ఆలోచించనీయవు. తనని ఆమె ఇష్టపడుతోందనే భావనతోనే అతను ఉంటాడు. రొమాంటిక్ టచ్ తో కూడిన సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది.
ఇక తాను ఒక 'రక్త పిశాచి' బంగ్లాలో బందీగా ఉండిపోయాననే విషయం 'మహి'కి అర్థమైపోతుంది. ఆ బంగళాలోకి ఎవరూ వచ్చి తనని రక్షించలేరనే విషయం కూడా అతనికి స్పష్టమైపోతుంది. అయినా తనని ఆమె అంతం చేసేలోగా తాను అక్కడి నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను చేసే ప్రయత్నాలు .. ఎదురయ్యే అనుభవాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
ఫ్లాట్ బయట మూడు పాత్రలు .. ఫ్లాట్ లోపల మూడు పాత్రలు .. మొత్తం ఆరు పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. హీరో - హీరోయిన్ చుట్టూ డిజైన్ చేసుకున్న సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కయాదు లోహర్ ను అందంగా చూపిస్తూనే భయపెట్టిన తీరు మెప్పిస్తుంది. హీరో ఆమె బారి నుంచి తప్పించుకోవడానికి చేసే విఫల ప్రయత్నాలు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. ఆదివాసీల ఎపిసోడ్ .. రక్త పిశాచి గురించి బుక్ రాసిన వ్యక్తి ఎపిసోడ్ .. సింధు ఇంట్లో చిక్కుబడిపోయిన డాక్టర్ ఎపిసోడ్ కథకి మరింత బలాన్ని ఇస్తాయి.
హారర్ సినిమాలు చాలా వరకూ ఒక బంగ్లాకు గానీ .. ఒక ఫ్లాట్ కి గాని పరిమితమవుతూ ఉంటాయి. అలాగే ఈ కథ కూడా నాలుగు గోడల మధ్యనే జరుగుతుంది. అది కూడా దాదాపు రెండు పాత్రల మధ్యనే నడుస్తుంది. కాకపోతే ఎక్కడా బోర్ అనిపించదు. అందుకు కారణం ట్రీట్మెంట్ అనుకోవచ్చు .. కయాదు లోహర్ గ్లామర్ అనుకోవచ్చు. ఆమె గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అనే చెప్పుకోవలసి ఉంటుంది.
అరుణ్ రాధాకృష్ణన్ ఫొటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. కయాదు లోహర్ ను చూపించిన తీరు అలరిస్తుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. సందర్భానికి తగిన సంగీతం, ఆడియన్స్ ను కథతో పాటు తీసుకెళుతుంది. ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి రాజేశ్ ఎడిటింగ్ కూడా ముఖ్యమైన పాత్రను పోషించిందనే చెప్పాలి.

Movie Details
Movie Name: Immortal
Genre: Horror, Romance, Thriller
Release Date: 30 Oct 2026
Cast: G V Prakash Kumar, Kayadu Lohar, T M Karthik, Kumar Natarajan, Lollu Sabha Maaran, Aaditya Kathir
Director: Mariyappan Chinna
Music: Sam C S
Banner: AK Film Factory
Review By: Peddinti