- ఎన్టీఆర్ చేతుల మీదుగా 'ఇట్లు అర్జున' సినిమా ట్రైలర్ విడుదల
- హీరో అనీష్ నటనపై ప్రశంసలు కురిపించిన తారక్
- మాటలు రాని దొంగ పాత్రలో ఆకట్టుకుంటున్న హీరో
- రూ.1,000 కోట్ల చుట్టూ తిరిగే ఉత్కంఠభరిత కథ
- నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
యువ కథానాయకుడు అనీష్, అందాలభామ అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఇట్లు అర్జున'. ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుధవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా డెబ్యూ హీరో అనీష్ నటనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ, "ఇదిగో 'ఇట్లు అర్జున' ట్రైలర్. అనీష్, నీ తొలి సినిమాలోనే ఒక్క మాట కూడా లేకుండా నటించడం నిజంగా గొప్ప ధైర్యం. కథ మీద నమ్మకంతో ఇలాంటి పాత్రను ఎంచుకోవడం అభినందనీయం. నీకు మంచి ఆరంభం లభించాలని కోరుకుంటున్నాను సోదరా" అని పేర్కొన్నారు. అలాగే సంగీత దర్శకుడు తమన్, అనశ్వర రాజన్, దర్శకుడు మహేశ్ ఉప్పాల, రాజా మహాదేవన్, వెంకీ కుడుముల సహా మొత్తం చిత్ర బృందానికి నవంబర్ 13న విడుదలవుతున్న సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే, కథానాయకుడు అర్జున్ (అనీష్)కు మాటలు రావు. అంతేకాదు, అతను చేయితిరిగిన దొంగ. నగరంలో జరిగిన ఓ దొంగతనం కేసులో పోలీసులు అతడినే ప్రధాన నిందితుడిగా అనుమానించి వెతుకుతుంటారు. మరోవైపు, అర్జున్ తన స్నేహితురాలు కీర్తి (అనశ్వర రాజన్)ని ప్రేమిస్తుంటాడు. చదువుపై శ్రద్ధ చూపే కీర్తి, అర్జున్ను మంచివాడిగా నమ్ముతుంది.
ఇదే సమయంలో, రూ.1000 కోట్లకు సంబంధించిన ఒక పెన్‌డ్రైవ్ కోసం ఓ భయంకరమైన గ్యాంగ్ వెతుకుతుంటుంది. ఆ డబ్బు కోసం వారు ఎంతకైనా తెగిస్తారు. కొన్ని కారణాల వల్ల ఆ గ్యాంగ్, పోలీసులతో పాటు అర్జున్, కీర్తి వెంట పడుతుంది. ఈ ఉత్కంఠభరితమైన ఛేజింగ్‌లో ఏం జరిగిందనేది కథాంశంగా తెలుస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల తన 'వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్‌పై నిర్మాతగా వ్యవహరించడం విశేషం. స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాతో మహేశ్ ఉప్పాల దర్శకుడిగా, అనీష్ హీరోగా పరిచయం అవుతున్నారు. సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. మొదట అక్టోబర్ 30న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం, వాయిదా పడి నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.