- రోజాను కలిసిన వైసీపీ విజేతలు
- విజేతలను అభినందించిన రోజా
- మూడు పార్టీలు కలిసి వైసీపీపై పోటీ చేశాయని వ్యాఖ్య
నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు పలు వార్డుల్లో విజయం సాధించారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో 7 వార్డులను వైసీపీ కైవసం చేసుకోగా, పుత్తూరులో 4 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. నగరిలో 3, 15, 18, 23, 26, 28, 38 వార్డులతో పాటు, పుత్తూరులో 4, 27, 29, 36 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థులు మాజీ మంత్రి రోజాను కలిశారు. ఈ సందర్భంగా విజేతలను రోజా అభినందించారు. అనంతరం రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో రౌడీయిజం, గూండాయిజంతో తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. మూడు పార్టీలు కలిసి వైసీపీపై పోటీ చేశాయని, అయినప్పటికీ తమ అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలవడం సంతోషంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని రోజా మండిపడ్డారు. పోలీసులు, అధికారులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం విజయాలు సాధించిందని విమర్శించారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఆమె స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో రౌడీ రాజకీయాలకు ప్రజలు ఓటుతోనే సమాధానం చెబుతారని, కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు.