ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని 1వ వార్డులో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు మొదట ప్రకటించారు.

ఈ ఫలితంపై బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఒక్క ఓటు తేడా ఉండటంతో ఓట్లను తిరిగి లెక్కించాలని ఆమె పట్టుబట్టారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సిబ్బంది... 1వ వార్డులో రీకౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ పరిణామంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అధికారులు ఓట్లను మరోసారి లెక్కిస్తుండటంతో ఇరు పార్టీల ఏజెంట్లలోనూ టెన్షన్ నెలకొంది. తుది ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.