- కరవు మండలాల జాబితా అశాస్త్రీయమన్న బండి సంజయ్
- కరీంనగర్ పార్లమెంట్ పరిధికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపణ
- 35 శాతం వర్షపాతం లోటు ఉన్న మండలాలను కూడా విస్మరించారని ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కరవు మండలాల జాబితాపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ జాబితా అత్యంత అశాస్త్రీయంగా, పక్షపాత ధోరణితో ఉందని ఆయన ఆరోపించారు. కేవలం మొక్కుబడిగా ఈ జాబితాను తయారు చేశారని మండిపడ్డారు.
ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బండి సంజయ్ అన్నారు. 35 శాతం వర్షపాతం లోటు ఉన్న మండలాలను కూడా జాబితాలో చేర్చకపోవడం ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లోని తీవ్ర కరవు పరిస్థితులు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పంట పొలాలు బీళ్లుగా మారినా, ప్రజలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
నష్టపరిహారం ఖర్చులు తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే కరీంనగర్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరించారా? అని ఆయన నిలదీశారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రైతులతో మాట్లాడితేనే కరవు తీవ్రత స్పష్టంగా తెలుస్తుందని సూచించారు. కరవు మండలాలను ఏ ప్రాతిపదికన, ఏ గణాంకాల ఆధారంగా గుర్తించారో తెలుపుతూ ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రతి మండలానికి వర్షపాతం లోటు, సాగు విస్తీర్ణం, పంట నష్టం, భూమిలో తేమ వంటి అంశాలను విడివిడిగా పరిశీలించి, అర్హులైన అన్ని మండలాలను జాబితాలో చేర్చాలని కోరారు. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో రైతుల పక్షాన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.