కల్వకుంట్ల కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లాలో ‘పాంచజన్య సంకల్ప సభ’ను నేడు నిర్వహిస్తోంది. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం సమీపంలోని మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఈ భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. సుమారు 15,000 మంది ప్రజలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

ఈ సభకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఇప్పటికే నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండు సభలను విజయవంతంగా నిర్వహించిన పార్టీ... మూడో సభను ఇంద్రవెల్లిలో నిర్వహిస్తోంది. ఈ సభ వేదికగా పార్టీకి చెందిన ‘పాంచజన్య’ సిద్ధాంతాన్ని కవిత కార్యకర్తలకు, ప్రజలకు వివరిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కరవు, ఇతర ప్రజా సమస్యలపై ఆమె ప్రసంగించే అవకాశం ఉంది.