- తనకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదని స్పష్టం చేసిన జాసన్ సంజయ్
- సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని సూచన
- తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాల వెల్లడి
- ఇటీవల 'సిగ్మా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వైనం
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కుమారుడు, యువ దర్శకుడు జాసన్ సంజయ్ తన అభిమాన సంఘాలపై కీలక ప్రకటన చేశాడు. తనకు ఎటువంటి అధికారిక ఫ్యాన్ క్లబ్‌లు లేవని, తన పేరుతో కొనసాగుతున్న ఏ సంఘాన్నీ తాను గుర్తించలేదని సోషల్ మీడియా వేదికగా ఆయన స్పష్టం చేశాడు.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో.. "మేము ఎటువంటి అధికారిక ఫ్యాన్ క్లబ్, అసోసియేషన్ లేదా కమ్యూనిటీ గ్రూపులను ప్రారంభించలేదు, గుర్తించలేదు. 'అధికారిక ఫ్యాన్ క్లబ్' లేదా 'అధీకృత కమ్యూనిటీ' అని చెప్పుకునే ఏ గ్రూపులైనా పూర్తిగా అనధికారికమైనవి, వాటికి మా ఆమోదం లేదు" అని పేర్కొన్నాడు. తన పేరుతో ఉన్న నకిలీ ఖాతాలు, పేజీల కంటెంట్‌కు లేదా వాటి చర్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదని, వాటికి తాను బాధ్యత వహించబోనని ఆయన తేల్చిచెప్పాడు.
అదే సమయంలో, తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను ఆయన వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్ (jason.sanjay_official), ఫేస్బుక్ (Jason Sanjay), ఎక్స్ (Jason Sanjay Official - x.com/official_jsj) మాత్రమే తన అధికారిక ఖాతాలని స్పష్టం చేశాడు.
జాసన్ సంజయ్ ఇటీవల 'సిగ్మా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ అక్టోబర్ 2న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు తాను ఉత్సాహంతో పాటు కొంత ఆందోళనగా ఉన్నట్లు జాసన్ పేర్కొన్నాడు.