- ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌లో సరదా ఘటన
- "ర్యాన్, మీ అమ్మ సింగిల్‌గా ఉన్నారా?" అంటూ అభిమాని ప్లకార్డు
- భారీ స్క్రీన్‌పై చూసి నవ్వేసిన క్రికెటర్ ర్యాన్ రికెల్టన్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సంఘటన
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ ర్యాన్ రికెల్టన్‌ను ఉద్దేశిస్తూ ఓ అభిమాని ఏమాత్రం భయం లేకుండా ప్రదర్శించిన ప్లకార్డు స్టేడియంలో నవ్వులు పూయించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఈ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో.. "ర్యాన్ రికెల్టన్, మీ అమ్మ సింగిల్‌గా ఉన్నారా?" అని రాసి ఉన్న ప్లకార్డును ఓ అభిమాని ప్రదర్శించాడు. బ్రాడ్‌కాస్టర్ కెమెరా అతడిపై దృష్టి సారించడంతో ఈ దృశ్యం అందరినీ ఆకర్షించింది.
తొలుత ఈ విషయాన్ని గమనించని రికెల్టన్‌కు, సహచర ఆటగాళ్లు చెప్పడంతో మైదానంలోని భారీ స్క్రీన్‌పై చూసుకున్నాడు. ప్లకార్డుతో పాటు కెమెరాలో కనిపించిన ఆ అభిమాని, రికెల్టన్ తల్లిని ఉద్దేశిస్తూ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ఇది చూసిన రికెల్టన్, వద్దన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూనే చిరునవ్వు చిందించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 83 బంతుల్లో 42 పరుగులు చేశాడు. సిరీస్‌లోని తొలి టెస్టులో ఓపెనర్‌గా విఫలమవడంతో, ఆ తర్వాత అతడిని మిడిలార్డర్‌కు మార్చిన సంగతి తెలిసిందే.