జనసేనలో చేరిన ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత బైరా దిలీప్
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
- గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి నుంచి పోటీ
- పవన్కు తాను రచించిన 'లైఫ్ హ్యాక్స్' పుస్తకం బహూకరణ
ప్రజారాజ్యం పార్టీ మాజీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన దిలీప్ చక్రవర్తి, గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.
మెగా కుటుంబంతో దిలీప్ చక్రవర్తికి సుదీర్ఘ కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలోనూ జనసేన పార్టీతో కలిసి పనిచేసిన ఆయన, తదనంతర కాలంలో వ్యాపార వ్యవహారాలపై దృష్టి సారించేందుకు రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తాజాగా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని, ఆయన తిరిగి జనసేన గూటికి చేరారు.
ఈ సందర్భంగా దిలీప్ చక్రవర్తి తాను రచించిన 'లైఫ్ హ్యాక్స్' పుస్తకాన్ని పవన్ కల్యాణ్కు బహూకరించారు. అనంతరం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.