- కొచ్చిలో మెర్సిడెస్ కారు ఢీకొని స్కూటరిస్ట్ మృతి
- కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ బాధితుడి కుటుంబం ఆరోపణ
- పోలీస్ స్టేషన్లో జడ్జి దురుసుగా ప్రవర్తించారని బంధువుల ఆరోపణ
- ఒత్తిడి పెరగడంతో నాన్-బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు
కేరళలో ఓ న్యాయమూర్తి మైనర్ కుమారుడు నడిపిన మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కొచ్చిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు జడ్జి కుమారుడు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు కేసులో నాన్-బెయిలబుల్ సెక్షన్లు జోడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . కొచ్చిలోని చెరనల్లూరు కంటైనర్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ (తట్టుకడ) నడుపుకునే జయబాలకృష్ణన్ (54) తన పనులు ముగించుకుని స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో, త్రిస్సూర్‌కు చెందిన ఓ జడ్జి 17 ఏళ్ల కుమారుడు నడుపుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు వెనుక నుంచి స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ నుజ్జునుజ్జుకాగా, జయబాలకృష్ణన్ అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా కారు నడపాలనిపించి బయటకు తెచ్చానని తెలిపాడు. అయితే, భారీ వర్షం కారణంగా నీటి మడుగును తప్పించేందుకు స్కూటరిస్ట్ అకస్మాత్తుగా పక్కకు తిరగడంతో తాను కారును అదుపు చేయలేకపోయానని బాలుడు పోలీసులకు వివరించాడు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో బాలుడు మద్యం తాగలేదని తేలినా, శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అనంతరం పోలీసులు అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.
అయితే, జడ్జి కుమారుడు కావడంతోనే పోలీసులు కేసును తేలికపాటి సెక్షన్ల కింద నమోదు చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్లో తమను ప్రశ్నించినందుకు జడ్జి తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని, పిడికిలి బిగించి బెదిరించారని ఆరోపించారు. ప్రమాదానికి గురైన కారు ఫొటోలను తన ఫోన్ నుంచి పోలీసులు బలవంతంగా డిలీట్ చేయించారని మృతుడి సోదరుడు వాపోయాడు. ఈ వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పోలీసులు స్పందించారు.
తొలుత నమోదు చేసిన బెయిలబుల్ సెక్షన్లతో పాటు, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 (హత్యానేరం కిందకు రాని నేరపూరిత హత్య) అనే నాన్-బెయిలబుల్ సెక్షన్‌ను కూడా జోడించారు. దీంతో మైనర్‌ను తిరిగి అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల హామీ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు కారు యజమాని అయిన జడ్జిపై కూడా మోటారు వాహన చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.