- న్యూజిలాండ్‌పై రెండో టీ20లో భారత్ ఉత్కంఠ విజయం
- టీ20 ఫార్మాట్లో 200 విజయాలు అందుకున్న తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
- ఈ మ్యాచ్‌తో తన 300వ అంతర్జాతీయ టీ20 పూర్తి చేసుకున్న భారత్
టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో అద్భుత విజయం సాధించి, ఈ ఫార్మాట్లో 200 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. టాప్ ఆర్డర్ విఫలమైన చోట, యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి అసాధారణ పోరాట పటిమతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ టీమిండియాకు 300వ అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం.
ఇప్పటివరకు ఆడిన 300 మ్యాచ్‌లలో భారత్ 200 విజయాలు సాధించగా, 83 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. మరో 7 మ్యాచ్‌లు టైగా ముగియగా, 10 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా రద్దయ్యాయి. ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ ఉంది. పాక్ 304 మ్యాచ్‌లలో 176 విజయాలు సాధించింది. వీరి తర్వాత న్యూజిలాండ్ (135), దక్షిణాఫ్రికా (129), ఇంగ్లండ్ (128), ఆస్ట్రేలియా (127) జట్లు ఉన్నాయి.