బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు: మంత్రి పొంగులేటి
గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 21 శాతానికి పైగా పెరిగిందన్న పొంగులేటి
ఇదే రేవంత్ రెడ్డి సమర్థ పాలనకు నిదర్శనమని వ్యాఖ్య
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని భూ అక్రమాలను వెలికితీస్తున్నామని వెల్లడి

తెలంగాణలో భూముల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థ పాలనపై విశ్వాసం ఉంచారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగిందని వివరించారు. గత ఏడాదితో పోలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 21.86 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. ఈ గణాంకాలే ప్రభుత్వ పనితీరుకు, సీఎం రేవంత్ రెడ్డి పాలనా సామర్థ్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు.
రాజకీయ లబ్ధి కోసం భూములపై బీఆర్ఎస్ చేసిన అసత్య ప్రచారాలను, ఆరోపణలను ప్రజలు నమ్మలేదని పొంగులేటి అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన భూ అక్రమాలను తమ ప్రభుత్వం వెలికితీస్తోందని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతూ, ప్రజలకు వివాదరహిత భూములను అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.