ఆల్ రౌండర్లకు నష్టం చేస్తున్నా.. 2027 వరకు ఆ రూల్ కొనసాగించాల్సిందే: దినేశ్ కార్తీక్
- 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన 2027 వరకు కొనసాగాలన్న డీకే
- ఐపీఎల్ సైకిల్ మధ్యలో రద్దు చేయడం సరికాదని వ్యాఖ్య
- ఈ రూల్ వల్ల భారత ఆల్ రౌండర్లు తగ్గిపోతున్నారని ఆందోళన
- జట్లు ఈ నిబంధన ప్రకారమే ఏర్పడ్డాయని గుర్తు చేసిన దినేశ కార్తీక్
ఐపీఎల్‌లో వివాదాస్పదంగా మారిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాటింగ్ కోచ్, మెంటార్ దినేశ్ కార్తీక్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ నిబంధన వల్ల భారత క్రికెట్‌కు ఆల్ రౌండర్లు కరువవుతున్నారని అంగీకరిస్తూనే, ప్రస్తుత ఐపీఎల్ సైకిల్ ముగిసే 2027 వరకు దీనిని కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. మెగా వేలం తర్వాత ఏర్పడిన సైకిల్ మధ్యలో ఈ నిబంధనను తొలగించడం సరికాదని స్పష్టం చేశాడు.
'క్రిక్‌బజ్'తో మాట్లాడుతూ దినేశ్ కార్తీక్ ఈ విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "2025 మెగా వేలం తర్వాత జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను దృష్టిలో ఉంచుకునే తమ కూర్పును సిద్ధం చేసుకున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ఈ నిబంధనను తొలగిస్తే, కొన్ని జట్లకు అన్యాయం జరుగుతుంది. 12 మంది ఆటగాళ్లతో వ్యూహాలు రచించిన జట్ల కన్నా, 11 మందితో బలంగా ఉండే జట్లకు ఇది అనైతిక ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే ఈ సైకిల్ ముగిసే వరకు దీనిని కొనసాగించడమే సరైనది" అని ఆయన వివరించాడు.
అయితే, 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై కార్తీక్ విమర్శలు కూడా చేశాడు. "ఈ రూల్ వచ్చిన కొత్తలో హై-స్కోరింగ్ మ్యాచ్‌లు, హోరాహోరీ ఛేజింగ్‌లతో ఆసక్తికరంగా అనిపించింది. కానీ గత సీజన్‌లో ఆ జోరు తగ్గింది. చాలా మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగిశాయి. ఈ నిబంధన దాని ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతోంది. ముఖ్యంగా దీనివల్ల భారత జట్టుకు నాణ్యమైన ఆల్ రౌండర్లు లభించే అవకాశాలు తగ్గిపోతున్నాయి" అని కార్తీక్ ఆందోళన వ్యక్తం చేశాడు.
ఏదైనా కొత్త నిబంధనను ఐపీఎల్ సైకిల్ ప్రారంభంలో తీసుకురావాలని, తొలగించాలనుకుంటే సైకిల్ ముగిశాక మాత్రమే చేయాలని సూచించాడు. "నిజానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కూడా సైకిల్ మధ్యలోనే తీసుకొచ్చారు. ఇప్పుడు దానిని మళ్లీ మధ్యలోనే తీసేయడం అస్సలు అర్ధవంతం కాదు. అందుకే 2027 వరకు దీనిని కొనసాగించి, ఆ తర్వాత దానిపై సమీక్ష జరపడం ఉత్తమం" అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.