విజయవాడలో టెన్షన్.. షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు
- సీఈసీ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి నిరసన
- కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు ఈరోజు గృహనిర్బంధం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఉన్న ఆమె నివాసం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులను మోహరించారు. ఇండియా కూటమి పార్టీలు విజయవాడలో తలపెట్టిన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగించారని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ ఉదయం 10 గంటలకు విజయవాడలోని లెనిన్ సెంటర్ నుంచి రాజ్‌భవన్ వరకు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్, వామపక్ష పార్టీల కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ షర్మిల ఇంటి నుంచి బయటకు వస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది.