సీపీఎం నేత ఎంఏ గఫూర్‌కు పుత్రశోకం.. అమెరికాలో కుమారుడి మృతి
- ఎంఏ గఫూర్ కుమారుడు పీవీ కిరణ్ మృతి
- అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో కన్నుమూత
- మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు
సీపీఎం సీనియర్ నేత, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు పీవీ కిరణ్ (41) అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కిరణ్ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
వివరాల ప్రకారం, అక్టోబర్ 2వ తేదీన కిరణ్ నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆ రోజు ఆయన ఆఫీస్‌కు వెళ్లకపోవడం, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగులు, స్నేహితులు ఆయన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా, అప్పటికే మరణించి ఉన్నారు. వారు వెంటనే స్థానిక పోలీసులకు, కర్నూలులోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కిరణ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగు నుంచి ఐదు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. కిరణ్ మరణ వార్త తెలియగానే పలు రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలులోని గఫూర్ నివాసానికి సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.