తిరుమల శ్రీవారికి జైపూర్ దంపతుల ఖరీదైన కానుక.. మ‌రో దాత భారీ విరాళం
Add ap7am to your home Screen

తిరుమల శ్రీవారికి జైపూర్ దంపతుల ఖరీదైన కానుక.. మ‌రో దాత భారీ విరాళం

Jaipur couple presents expensive gift to Tirumala Srivaru
  • శ్రీవారికి రూ. 51.55 లక్షల విలువైన ఆభరణాలు విరాళం
  • జైపూర్ దంపతులు సమర్పించిన బంగారు లాకెట్, ముత్యాల హారం
  • టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు రూ. 10 లక్షల భారీ విరాళం
  • అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దాత హర్షవర్ధన్ రెడ్డి
తిరుమల శ్రీవారికి నేడు భారీగా విరాళాలు, కానుకలు అందాయి. భక్తులు స్వామివారికి విలువైన ఆభరణాలతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు నగదు రూపంలో విరాళాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు శ్రీవారికి రూ. 51.55 లక్షలు విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. ఇందులో వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్, వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల మూడు వరుసల ముత్యాల హారం ఉన్నాయి. ఈ ఆభరణాలను ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు దాతలు స్వయంగా అందజేశారు. ఉత్సవమూర్తుల అలంకరణకు వీటిని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.


అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న 'బర్డ్' ట్రస్ట్‌కు కూడా భారీ విరాళం అందింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దాత హర్షవర్ధన్ రెడ్డి రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. హర్షవర్ధన్ రెడ్డి తరఫున టీటీడీ పాలకమండలి సభ్యుడు నన్నపనేని సదాశివరావు ఈ డీడీని ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు. టీటీడీ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న దాత హర్షవర్ధన్ రెడ్డికి ఛైర్మన్ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Tirumala Lord Venkateswara
Aarti Bindal
TTD Chairman BR Naidu
Jaipur couple donation
BIRRD Trust
Tirumala Tirupati Devasthanams

More Telugu News